రెండు హిటాచీలు దహనం


Wed,September 12, 2018 02:29 AM

దేవరకొండ, నమస్తేతెలంగాణ : మండలంలోని తాటికోల్ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి రెండు హిటాచీలను స్థానికులు దహనం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని తాటికోల్ వాగులో ఉన్న ఇసుకను తోడేందుకు మైనింగ్ శాఖ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఇసుకను తరలించేందుకు సంబంధిత గుత్తేదారు హిటాచీలను వాగు ప్రాంతానికి తరలించాడు. అయితే కొంతకాలంగా ఇసుక తరలింపుపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండగా సోమవారం రాత్రి స్థానికులు కొందరు వాగు వద్ద ఉన్న రెండు హిటాచీలను తగులబెట్టారు. ఈ మేరకు గుత్తేదారు కొండవీటి సుభాష్‌రెడ్డి ఫిర్యాదు చేయగా తాటికోల్ గ్రామానికి చెందిన 12మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

130
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...