యువతిని బ్లాక్‌మెయిల్ చేస్తున్న వ్యక్తి అరెస్టు


Wed,September 12, 2018 02:29 AM

నల్లగొండ క్రైం : ఫెస్‌బుక్‌లో పరిచయమై ఫొటోలు దిగి ఆ ఫొటోలతో యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని మంగళవారం వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ పీఎన్‌డీ ప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ పట్టణానికి చెందిన ఓ యువతి హైదరాబాద్‌లో విద్యనభ్యసిస్తుండగా ఈ క్రమంలో కరీంనగర్‌కు చెందిన నాగరాజు చెన్నైలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తున్నాడు. ఫేస్‌బుక్‌లో యువతితో పరిచయం ఏర్పడింది. ఆమెతో గతంలో దిగిన ఫొటోలు యువతి తండ్రికి పంపిస్తానని బ్లాక్‌మెయిల్ చేస్తుండడంతో ఆమె తండ్రికి తెలిపింది. దీంతో యువతి తండ్రి ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

125
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...