వేర్వేరు కేసుల్లో ఇద్దరికి రిమాండ్


Wed,September 12, 2018 02:28 AM

నడిగూడెం : వివాహితను లైంగికంగా వేధించిన కేసులో విచారణ అనంతరం వ్యక్తిని అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్ చేశారు. ఎస్‌ఐ మల్లేషం తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని రామాపురానికి చెందిన మారిశెట్టి శ్రీహరి కొన్ని రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన వివాహితను లైంగికంగా వేధించిన కేసులో విచారణ అనంతరం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. అలాగే మునగాల మండలం బరాఖత్‌గూడెం గ్రామానికి చెందిన బొడ్డు శ్రీను ఫారెస్టు బీట్ ఆఫీసర్ అచ్చయ్య విధులకు ఆటంకం కలిగించి మండల పరిధిలోని రామాపురం వద్ద ఫారెస్టు భూమిలో పెన్సింగ్ కూల్చిన కేసులో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...