జగ్గారెడ్డిది నేరచరిత్ర..


Tue,September 11, 2018 11:41 PM

-మనుషుల అక్రమ రవాణాకు పాల్పడిన దేశద్రోహి
-కాంగ్రెస్ హయాంలోనే కేసులు నమోదయ్యాయి
-జగ్గారెడ్డిని సస్పెండ్ చేసి గౌరవం కాపాడుకోవాలి
-స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ బూర విజయ
సిద్దిపేట టౌన్ : నేర చరిత్ర జగ్గారెడ్డి సొంతం... మనుషులను విదేశాలకు అక్రమ రవాణాకు పాల్పడి కుటుంబాన్ని, రాష్ట్రాన్ని మోసం చేసి దేశచట్టాలను ఉల్లంఘించిన ద్రోహి అని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ బూర విజయ విమర్శించారు. ఈ మేరకు సిద్దిపేటలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు నందాదేవి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యురాలు షాకీరా, పొన్నమల్ల సువర్ణ, కదుర్ల తారతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.

జగ్గారెడ్డి అరెస్టు వెనుక టీఆర్‌ఎస్ కుట్ర ఉందనడం సిగ్గు చేటని మండిపడ్డారు. 2010లో ప్రజల్లో అలజడి రేపి శాంతిభద్రతల విఘా తం కల్పించినందుకు అతడిపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేసిందని గుర్తు చేశారు. జగ్గారెడ్డి చేసిన నేరాలకు సొంత పార్టీ కాంగ్రెస్సే అరెస్టు చేసి, జైళ్లో పెట్టిన విషయం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరిచిపోయారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు మనుషుల అక్రమ రవాణా కేసులో పోలీసులు అరెస్టు చేస్తే అతడ్ని కాపాడేందుకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నించడం కాంగ్రెస్ దేశద్రోహి పార్టీగా మారుతుందనే అనుమానాలు కూడా వస్తున్నాయని ఆరోపించారు. తాను దేశభక్తుడ్ని అని ఎప్పటికీ చెబుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఇప్పుడు దేశ ద్రోహానికి పాల్పడిన జగ్గారెడ్డిని రక్షించేందుకు చూడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

జగ్గారెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో పోరాడారా?, పేదప్రజల కోసం ఏమైనా చేశారా..? దేశరక్షణ కోసం ప్రాణాలను ఫణం గా పెట్టారా..? ఆయన అరెస్టు పట్ల మీకెందుకు అంత ఆందోళన అని ప్రశ్నించారు. జగ్గారెడ్డి స్వాతంత్య్ర సమరయోధుల పేరిట ఉన్న వంద ఎకరాల భూమిని కబ్జా చేసి సమరయోధులకు అన్యాయం చేశారని ఆరోపించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి వద్ద తాకట్టు పెట్టిన ద్రోహి అని అన్నారు. సంగారెడ్డిలో మత ఘర్షణలకు జగ్గారెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం కారణమన్నారు. సదాశివపేటలో దళితులపై దైర్జన్యం చేసినందుకు ఎస్సీ, ఎస్టీ కేసు న మోదు చేసిన విషయం మరిచారా?అని నిలదీశారు. మహిళల అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తిని కాం గ్రెస్ కాపాడాలని చూడడం నేరస్తులకు సద్దికట్టడమే మండిపడ్డారు. రౌడీ, గుండాయిజం, భూకబ్జాలు, మత ఘర్షణలకు పాల్పడిన జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారని, కాంగ్రెస్ పార్టీ వెంటనే అతడ్ని సస్పెండ్ చేసి గౌరవం దక్కించుకోవాలని హితవు పలికారు.

176
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...