రామలింగారెడ్డికి సర్వజనుల మద్దతు


Tue,September 11, 2018 11:41 PM

రాయపోల్ : టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డిని ప్రకటించడంపై అన్నివర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగం గా మంగళవారం రాయపోల్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన పీఏంపీలు, ఆర్‌ఏంపీలు సూమరు 40 మంది రామలింగారెడ్డికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎంపీలు, పీఎంపీల మండల అధ్యక్షు డు శ్రీకాంత్ మాట్లాడుతూ.. రామలింగారెడ్డి గెలుపు కోసం తమవంతు ప్రచారం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎంపీ, పీఎంపీలు మల్లేశం, విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రసాద్, వెంకటేశం, సాయిలు, నర్సింలు, గణేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

రామలింగారెడ్డిని కలిసిన టీఆర్‌ఎస్ శ్రేణులు
రామలింగారెడ్డిని దౌల్తాబాద్ మండలం గాజులపల్లి, రాయపోల్ మండలం మంతూర్ గ్రామాల టీఆర్‌ఎస్ నేతలు కలిసి శుభకాంకాక్షలు తెలిపారు. ఎన్నికల్లో రామలింగారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. కార్యక్రమంలో గాజులపల్లి గ్రా మస్తులు అంజి, నగేశ్, దేవిరెడ్డి, స్వామి, దశరథం, బాల్‌రెడ్డి, మంతూర్ గ్రామస్తులు బాగిరెడ్డి, ఎల్లయ్య, ఫర్వేజ్ అహ్మద్, రామదాసుగౌడ్, సంతోశ్, చంద్రం, షాదుల్లా పాల్గొన్నారు.

మద్దతు తెలిపిన వెంకటాపూర్ గ్రామ సంఘాలు
తొగుట : మా గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డికే మద్దతు ప్రకటిస్తున్నామని మండలంలోని వెంకట్‌రావుపేటకు చెందిన వివిధ కుల సంఘాల నా యకులు పేర్కొన్నారు. మాజీ సర్పంచ్ అంజమ్మప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాల నాయకులు ఎమ్మెల్యేను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నేతలు జీడిపల్లి మోహన్‌రెడ్డి, పులిగారి శివయ్య, కంకనాల నర్సింలు, నారాయణ, పాత్కుల బాలయ్య, తుప్పతి భిక్షపతి, వడ్డె రామచంద్రం, మన్నె మల్లేశం, కల్లెపు సత్తయ్య, బండారు స్వామి గౌడ్, బండారు రమేశ్‌గౌడ్, స్వామి, పర్షరాములు ఉన్నారు.

టీఆర్‌ఎస్‌కే మా మద్దతు : టీఎఫ్‌టీయూ
కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతున్న టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటిస్తున్నామని టీఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్వాల కృష్ణాగౌడ్ తెలిపారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ మల్లేశం, నాయకులు రమేష్, లక్ష్మి నర్సయ్య, స్వామి, బాల్‌రెడ్డి, ప్రశాంత్, గణేశ్ పాల్గొన్నారు.

154
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...