కంటి పరీక్షలకు భారీ స్పందన


Tue,September 11, 2018 11:41 PM

దుబ్బాక, నమస్తే తెలంగాణ : ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్.. కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం గ్రామీణ ప్రజలకు వరంగా మారింది. ముఖ్యంగా బడుగు,బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ఆర్థిక ఇబ్బందులతో ఖరీదైన కంటి వైద్యం నోచుకోలేక.. మసకబారిన చీకటి జీవితాలు గడుపుతున్న వారికి కంటి వెలుగు పథకం వెలుగులు ప్రసాదిస్తుంది. గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలకు రోజురోజుకు విశేష స్పందన వస్తుంది. కంటి సమస్యలతో శిబిరానికి వచ్చినవారికి వైద్య సిబ్బంది పరీక్షలు చేసి, ఉచితంగా కంటి అద్దాలు అందజేస్తున్నారు.

మంగళవారంతో కంటి వెలుగు శిబిరం 18వ రోజుకు చేరింది. ఇప్పటివరకు రాయపోల్ మండలంలో రాయపోల్, రామారం, గొల్లపల్లి, సయ్యాద్‌నగర్ గ్రామాలు, దౌల్తాబాద్ మండలంలో దౌల్తాబాద్, దీపాయంపల్లి, గొడుగుపల్లి గ్రామాలు, తొగుట మండలంలో జప్తిలింగారెడ్డిపల్లి, వెంకట్రావ్‌పేట గ్రామాలు, మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామాల్లో ప్రజలకు కంటి వైద్య పరీక్షలు పూర్తి చేశారు.

నియోజక వర్గంలో మొత్తం 10 గ్రామాల్లో కంటి వెలుగు పూర్తి చేశారు. ప్రస్తుతం దుబ్బాక, మిరుదొడ్డి, దౌల్తాబాద్ మండలం దొమ్మాట, రాయపోల్ మండలం రాంసాగర్, తొగుట మండలం లింగాపూర్‌లో కంటి వెలుగు శిబిరం కొనసాగుతుంది. మంగళవారం దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట, తొగుట మండలం లింగాపూర్‌లో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలను డీఎం అండ్ హెచ్‌వో అమర్‌సింగ్ పరిశీలించారు. జిల్లాలో దుబ్బాక నియోజక వర్గం లోనే అత్యధికంగా కంటి వైద్య పరీక్షలు జరుగుతున్నాయని డీఎం అండ్ హెచ్‌వో అమర్‌సింగ్ పేర్కొన్నారు.

ఇప్పటివరకు నియోజక వర్గంలో 18,838 మందికి కంటిపరీక్షలు చేసి, 4,041 మందికి అద్దాలు అందజేశారు. 1,766 మందిని శస్త్ర చికిత్సకు తరలించారు. మరో 2 వేల మందికి కంటి అద్దాలను బుక్ చేశారు. దుబ్బాకలోని గాయత్రి వివేకానంద విద్యాలయంలో కొనసాగుతున్న కంటి వె లుగు శిబిరంలో 234 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 31 మందికి అద్దాలు అందజేశారు. ఏడుగురిని శస్త్ర చికిత్సకు తరలించారు. మరో 35 మందికి అద్దాలు బుకింగ్ చేశారు. మిరుదొడ్డి ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో 233 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఒకరికి అద్దాలు, మరోకరిని శస్త్ర చికిత్సకు తరలించారు. దౌల్తాబాద్ మండలం దొమ్మాటలో 220 మందికి పరీక్షలు నిర్వహించి, 160 మందికి అద్దాలు అందజేసి, 10 మందిని శస్త్ర చికిత్సకు తరలించారు. రాయపోల్ మండలంలో రాం సాగర్‌లో 207 మందికి కంటి పరీక్షలు, 36 మందికి అద్దాల పంపిణీ, ఇద్దరిని శస్త్రచికిత్సకు తరలించారు. తొగుట మండ లం లింగాపూర్‌లో 270 మందికి పరీక్షలు, 70 మందికి అద్దాలు, 34 మందికి శస్త్ర చికిత్సకు తరలించారు. కార్యక్రమంలో కంటివెలుగు వైద్యాధికారులు శ్రీజ, శ్రీధర్, స్వ రూప, వెంకటేశం, సూపర్‌వైజర్ మారియా, సిబ్బంది గణేశ్, రాజ్‌చైతన్య, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

130
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...