విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి


Tue,September 11, 2018 11:40 PM

-ఏసీపీ మహేందర్, మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య
-ఆనందోత్సాహాల మధ్య ఎస్‌జీఎఫ్ క్రీడోత్సవాలు ప్రారంభం
-అలరించిన విద్యార్థుల ఫ్లాగ్‌మార్చ్, ఆటాపాటలు
హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని హుస్నాబాద్ ఏసీపీ సందెపోగు మహేందర్, మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య అన్నారు. మంగళవారం హుస్నాబాద్‌లోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల స్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడోత్సవాలను స్థానిక ఎంపీపీ భూక్య మంగతో కలిసి వారు ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహించిన వివిధ పాఠశాలల విద్యార్థుల ఫ్లాగ్‌మార్చ్‌లో ఏసీపీతోపాటు అతిథులు క్రీడావందనం స్వీకరించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు, పాడిన పాటలు విశేషంగా అలరించాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగించడంతో పాటు స్నేహభావాన్ని పెంపొందిస్తాయన్నారు.అనంతరం వివిధ పాఠశాలల జట్ల మధ్య కబడ్డీ, వాలీబాల్ పోటీలు జరిగాయి. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం బండారి మనీల, బాలికల పాఠశాల హెచ్‌ఎం ఎస్ వెంకటయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయులు చందుల వీరసోమయ్య, పూల గోపాల్‌రెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్ అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లయ్య, డీఆర్‌పీ కక్కెర్ల రవీందర్, పీఈటీలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

130
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...