నేడు మాజీ డిప్యూటీ స్పీకర్ , మాజీ ఎమ్మెలే ప్రచారం ప్రారంభం


Tue,September 11, 2018 11:40 PM

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ మెదక్ ఆసెంబ్లీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డికి కేటాయించిన తర్వాత తొలిసారిగా మెదక్ బుధవారం రానున్నారు. ఉదయం 7 గంటలకు చిన్నశంకరంపేటలోగల అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి నేరుగా టీఆర్‌ఎస్ శ్రేణులతో మెదక్ క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. మెదక్ నుంచి భారీ బైక్ ర్యాలీతో పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గామాత సన్నిదికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు పద్మాదేవేందర్‌రెడ్డి ప్రచార రథం ప్రచారానికి సిద్ధ్దంగా ఉంది.

వెల్దుర్తి నుంచి మదన్‌రెడ్డి ప్రచారం ప్రారంభం...
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గానికి ఈశాన్య ప్రాంతమైన వెల్దుర్తి మండలం రామంతాపూర్ గ్రామంలో బుధవారం ప్రచారం ప్రారంభించనున్నారు. మాసాయిపేటలోని రుక్మిణీ పాండురంగ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యకర్తలు, నాయకులతో పాటు రామంతాపూర్ గ్రామానికి చేరుకుని కార్యకర్తల సమావేశం నిర్వహించి టీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించి అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.

139
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...