సీఎంఆర్ సేకరణ..83 శాతం పూర్తి


Tue,September 11, 2018 01:11 AM

సూర్యాపేట, నమస్తే తెలంగాణ : చిన్న జిల్లాల ఏర్పాటుతో సివిల్ సప్లయ్ శాఖలో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఏటా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసే కస్టం మిల్లింగ్ రైస్ సేకరణ (సీఎంఆర్)లో మార్పే అందుకు ఉదాహరణ. సమైక్య రాష్ట్రంలో సరైన పర్యవేక్షణ లేక మిల్లింగ్ చేస్తామని చెప్పి తీసుకున్న ధాన్యంను పక్కదారి పెట్టించి రూ.కోట్లు ప్రభుత్వానికి ఎగనామ పెట్టిన ఘనులు జిల్లాలో ఉన్నారు. అలాంటి వారిపై ఆర్‌ఆర్ యాక్ట్‌లు సైతం నమోదు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన జిల్లాలో అధికారుల పర్యవేక్షణ పూర్తి స్థాయిలో ఉండడంతో గత ఏడాది సీఎంఆర్ వంద శాతం పూర్తి చేశారు. ఈ ఏడాది యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా కోనుగోలు చేశారు. జిల్లా వ్యాప్తంగా వందకుపైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 1,38,240.106 మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోలు చేశారు. ఈ ఏడాది సూర్యాపేట జిల్లాతోపాటు నల్లగొండ, ఖమ్మం, యాదాద్రి జిల్లాల నుంచి సైతం ధాన్యం మిల్లింగ్ చేసేందుకు ఇక్కడికి తీసుకొచ్చారు. నల్లగొండ జిల్లా నుంచి 5410.272 మెట్రిక్ టన్నులు, యాదాద్రి జిల్లా నుంచి 8,500 మెట్రిక్ టన్నులు, ఖమ్మం జిల్లా నుంచి 17,800 మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాకు తరలించారు. నాలుగు జిల్లాకు చెందిన 1,70,157.847 మెట్రిక్ టన్నుల ధాన్యం సూర్యాపేట జిల్లాలోని 56 మిల్లులకు కేటాయించారు. నాలుగు నెలలుగా జిల్లాలోని మిల్లులో ధాన్యంను సీఎంఆర్ చేయడం ప్రారంభించారు. సోమవారం నాటికి అన్ని మిల్లులకు చెందిన ధాన్యం 95 వేల మెట్రిక్ టన్నుల బియ్యం తీశారు. సుమారు 83 శాతం మిల్లింగ్ పూర్తి చేశారు.

మిగిలింది 20 రోజుల గడువే..
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివరి నాటికి మిల్లులలో ఉన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి గోదాములకు తరలించాలని గడువు విధించింది. దీంతో అధికారులు సైతం మిగిలిన 17 శాతం సీఎంఆర్‌ను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. జిల్లాలోని 56 మిల్లులకు కేటాయించిన 1,70,157.847 మెట్రిక్ టన్నుల ధాన్యంలో 20 శాతం రా రైస్, 80 శాతం బాయిల్డ్ రైస్ రూపంలో సేకరించనున్నారు. రా రైస్ కోసం మిల్లింగ్ చేస్తే క్వింటాకు 67 కేజీల బియ్యం వస్తుండగా, బాయిల్డ్ రైస్ క్వింటాకు 68 కేజీల బియ్యం వస్తుంది. వీటికోసం ప్రభుత్వం మిల్లులకు రా రైస్‌కు రూ.30 ఇస్తుండగా బాయిల్డ్ రైస్ క్వింటాకు రూ.50ల చొప్పున మిల్లులకు మిల్లింగ్ చార్జీలు ఇవ్వనున్నది. 1,70,157.847 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 1,15,367.020 మెట్రిక్ టన్నుల బియ్యం రానున్నది. వీటిలో రా రైస్ 22801.151 మెట్రిక్ టనులు, బాయిల్డ్ రైస్ 92565.869 మెట్రిక్ టన్నుల రానున్నది. కేవలం 7 మిల్లులలోనే 40 శాతం వరకు మిల్లింగ్ పెండింగ్‌లో ఉండగా మరో 30 మిల్లులో 90 శాతం పూర్తయ్యింది. మరో 19 మిల్లులో 75-80 శాతం పూర్తయ్యింది. గడువు 20 రోజులే ఉండడంతో వేగంగా మిల్లింగ్ చేసేలా అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటి వరకు పూర్తయిన సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వ గోదాములకు తరలిస్తున్నారు. వీటిని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వినియోగించనున్నారు.

గడువు లోపు వంద శాతం పూర్తి చేస్తాం
ప్రభుత్వం విధించిన గడువు లోపే సీఎంఆర్‌ను పూర్తి చేస్తాం. ధాన్యాన్ని పరిశీలిస్తూ బియ్యం సేకరణపై ఒత్తిడి తెస్తున్నాం. గడువులోపు అన్ని మిల్లులు వంద శాతం పూర్తి చేయాలి. కేవలం7-9 మిల్లులు మాత్రమే కాస్త వెనుకంజలో ఉన్నాయి. మిగతా చోట్ల 80- 90 శాతం మిల్లింగ్ పూర్తయ్యింది. మిల్లర్లతో మాట్లాడి గడువు లోపు పూర్తి చేయిస్తాం. మిల్లింగ్ విషయంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తే ఎలాంటి చర్యలకైనా వెనుకాడం.
- రాంపతి నాయక్, సివిల్ సైప్లె డీఎం

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...