కొత్త ఓటర్లను నమోదు చేసుకోవాలి


Tue,September 11, 2018 01:10 AM

సూర్యాపేట, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ సురేంద్రమోహన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మండల, జిల్లా అధికారులతో ముసాయిదా ఓటర్ల జాబితాపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్ల సరవణ ప్రక్రియను ఈనెల 10నుంచి 25వరకు చేపట్టినట్లు తెలిపారు. ముసాయిదా జాబితా ప్రచురణ కోసం ఆయా మండలాలకు పంపించడం జరిగిందన్నారు. ఈ జాబితాలను పోలింగ్‌బూత్‌ల వారీగా ప్రచురణ చేసి అభ్యంతరాలు స్వీకరించాలని సూచించారు. సెప్టెంబర్ 10 నుంచి 25వరకు నూతన ఓటర్ల దరఖాస్తు స్వీకరణ, అభ్యంతరాల స్వీకరణ చేపట్టనున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 15,16 తేదీల్లో గ్రామసభలు నిర్వహించి పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటో ఓటర్ల జాబితాను చదివి వినిపించి పేర్లను సరిచేయడం జరుగుతుందని వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. అన్నిశాఖల అధికారులు ఉద్యోగుల వివరాలను అందించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో పి.చంద్రయ్య, సూర్యాపేట ఆర్డీఓ మోహన్‌రావు, కోదాడ ఆర్డీఓ ఎల్.కిశోర్‌తోపాటు జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...