సూర్యాపేట, నమస్తే తెలంగాణ : సమాజంలో భక్తి ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణ అంతే ముఖ్యమని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని కలెక్టర్ సురేంద్రమోహన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో బీసీ సంక్షేమ శాఖ పంపిణీ చేసిన మట్టి విగ్రహాల స్టాల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో పర్యావరణం కలుషితమవుతుందని, ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి జ్యోతి, డీఆర్డీఏ పీడీ సుందరి కిరణ్కుమార్, సవిల్ సప్లయ్ డీఎం రాంపతినాయక్, డీఎస్ఓ ఉషారాణి, ఎల్డీఎం శ్రీనివాస్, మైనార్టీ సంక్షేమాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.