నాలుగేండ్లలో అభివృద్ధే మంత్రి గెలుపునకు నాంది


Tue,September 11, 2018 01:10 AM

కుడకుడరోడ్డు : 60ఏండ్ల ఉమ్మడి నిర్లక్ష్య పాలనలో ప్రజలంతా విసిగి వేసారిపోయారని, అధికారం చేపట్టిన నాలుగేండ్లలోనే కనీవినీ ఎరుగని రీతిలో చేసిన అభివృద్ధే మంత్రి జగదీష్‌రెడ్డి గెలుపునకు నాంది అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సూర్యాపేట నియోజకవర్గవ్యాప్తంగా గ్రంథాలయాల అభివృద్ధికి జిల్లా మినరల్ ఫండ్ నుంచి రూ.85లక్షలు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 60ఏండ్లుగా ఏమాత్రం అభివృద్ధికి నోచని గ్రంథాలయాలు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 4ఏండ్లలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి అన్ని గ్రంథాలయాలను కనీవినీ ఎరుగనిరీతిలో అభివృద్ధి చేస్తున్నారన్నారు. మంత్రి జగదీష్‌రెడ్డి అత్యధిక నిధులతో పేటను అభివృద్ధి చేయడంతోపాటు జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాలకు అన్ని సౌకర్యాలు సమకూర్చారన్నారు. ఆయన సహకారంతోనే పాఠకులకు అవసరమైన అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు నేడు అందుబాటులో ఉంచామన్నారు. నేడు గ్రంథాలయాల అభివృద్ధికి మంత్రి జగదీష్‌రెడ్డి ప్రత్యేక చొరవతో జిల్లా మినరల్ ఫండ్ నుంచి జిల్లా కేంద్ర గ్రంథాలయానికి రూ.40లక్షలు, పెన్‌పహాడ్, చివ్వెంల, ఆత్మకూర్.ఎస్ మండలాల్లో ఒక్కో దానికి రూ.15లక్షల చొప్పున మొత్తం రూ.85లక్షలు కేటాయించారన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, పోలెబోయిన నర్సయ్యయాదవ్, తూడి నర్సింహారావు, కౌన్సిలర్ తాహేర్‌పాషా, వెంపటి గురూజీ, నూకల మధుసూదన్‌రెడ్డి, జంపాల శ్రీను, సెక్రటరీ కేవీ సీతారామశాస్త్రి, రేపాల పాండు, ఎల్గూరి రమాకిరణ్, రఫీ పాల్గొన్నారు.

125
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...