మంత్రి హరీశ్‌రావుకే మా ఓటు


Mon,September 10, 2018 11:56 PM

-గోమాత సేంద్రియ వికాస సంఘం, రైతు సంఘం సభ్యుల ఏకగ్రీవ తీర్మానం
చిన్నకోడూరు : రాష్ట్రంలోనే సిద్దిపేట నియోజకవర్గాన్ని అన్నింటిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని గోమాత సేంద్రియ వికాస రైతు సంఘం సభ్యుల కుటుంబాలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామానికి చెందిన గోమాత సేంద్రియ వికాస రైతు సంఘం సభ్యులు సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్, మల్లేశం, ఆదిమల్లయ్య, పోచయ్యలు మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావును భారీ మెజార్టీతో గెలిపించేందుకు సంఘం సభ్యులందరం ఏకగ్రీవ తీర్మాన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు, సంఘాలు మంత్రి హరీశ్‌రావుకే మా ఓటని ఏకగ్రీవ తీర్మానం చేశారు. కార్యక్రమంలో బాబు, తిరుపతి, యాదవరెడ్డి, శివకుమార్, రైతులు తదితరులు ఉన్నారు.

161
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...