వెలుగులు నింపుతున్న కంటి వెలుగు


Mon,September 10, 2018 11:56 PM

దుబ్బాక,నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. కంటి సమస్యతో బాధపడుతున్న ప్రజలకు పేదలకు వరంగా మారింది. సోమవారంతో కంటి వెలుగు శిబిరం 17వ రోజుకు చేరింది. నియోజకవర్గంలో ఇప్పటి వరకు రాయపోల్ మండలంలో రాయపోల్, రామారం, గొల్లపల్లి, సయ్యద్‌నగర్ గ్రామాలు, దౌల్తాబాద్ మండలంలో దౌల్తాబాద్, దీపాయంపల్లి, గొడుగుపల్లి , తొగుట మండలంలో జప్తిలింగారెడ్డిపల్లి, వెంకట్రావ్‌పేట , మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామాల్లో ప్రజలందరికీ కంటి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 10 గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమం పూర్తి చేశారు. ప్రస్తుతం నియోజకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, దౌల్తాబాద్ మండలం దొమ్మాట, రాయపోల్ మండలం రాంసాగర్, తొగుట మండలం లింగాపూర్‌లో కంటి వెలుగు శిబిరం కొనసాగుతున్నది. సోమవారం వరకు నియోజకవర్గంలో 17,674 మందికి కంటి వైద్య పరీక్షలు చేశారు. ఇందులో 3,743 మందికి కంటి అద్దాలు అందజేశారు. 1,712 మందిని శస్త్ర చికిత్సకు తరలించారు. మరో 1,857 మందికి కంటి అద్దాలకు బుక్ చేశారు. నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలోని గాయత్రి వివేకానంద విద్యాలయంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరంలో 162 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.

ఇందులో 46 మందికి అద్దాలు అందజేశారు. 15 మందిని శస్త్ర చికిత్సకు తరలించారు. మరో 50 మందికి అద్దాలు బుకింగ్ చేశారు. మిరుదొడ్డిలో కంటి వెలుగు శిబిరంలో 185 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 20 మందికి అద్దాలు, 11 మందిని శస్త్ర చికిత్సకు తరలించారు. దౌల్తాబాద్ మండలం దొమ్మాటలో సోమవారం కంటి వెలుగు శిబిరం ప్రారంభించారు. ఇందులో 206 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 43 మందికి అద్దాలు అందజేశారు. 10 మందిని శస్త్ర చికిత్సకు తరలించారు. రాయపోల్ మండలంలో రాంసాగర్‌లో ప్రారంభించిన కంటి వెలుగు శిబిరంలో 162 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 44 మందికి అద్దాలు, 12 మందిని శస్త్ర చికిత్సకు తరలించారు. తొగుట మండలం లింగాపూర్‌లో 182 మందికి పరీక్షలు చేశారు. ఇందులో 55 మందికి అద్దాలు, 20 మందికి శస్త్ర చికిత్సకు తరలించారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు వైద్యాధికారులు శ్రీజ, శ్రీధర్, స్వరూప, వెంకటేశం, సూపర్‌వైజర్ మారియా, సిబ్బంది గణేశ్, రాజ్‌చైతన్య, ఏఎన్‌ఎంలు, సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

128
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...