భక్త జన సంద్రం.. పార్వతీ సమేతుడి క్షేత్రం


Mon,September 10, 2018 03:10 AM

- రామలింగేశ్వరుడి లక్ష పుష్పార్చన
నార్కట్‌పల్లి : మండల పరిధిలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆల యం భక్తులతో కిక్కిరిసింది. ఆదివారం అమా వాస్య కావడంతో జిల్లానుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చిన భక్తుల తా కిడితో పార్వతీ సమేతుడి క్షేత్రం పోటె త్తింది. గుట్టపై నిద్ర చేసే భక్తులు ఓం న మః శివా అంటూ శివసత్తుల పూనకాల తో స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శిం చుకున్నారు. అదేవిధంగా మానసిక రుగ్మ తులతో బాధ పడేవారు ఈ క్షేత్రంపై మం డల దీక్ష చేసి శివనామస్మరణలతో జపిస్తే అనా రో గ్యం మటుమాయమై సంపూర్ణ ఆరోగ్యవంతు లౌతారనే విశ్వాసం భక్తు ల్లో ఉంది. దీంతో అ మావాస్య తిధి రోజున భక్తులు అధిక సంఖ్యలో నిద్రచేసి స్వామివారిని దర్శించుకున్నారు. అమ్మ వారికి నైవేథ్యంతో వండిన బోణాన్ని డప్పు చ ప్పుల్లతో తీసుకెళ్లి భక్తిశ్రద్ధలతో సమర్పించారు.
పార్వతీ పరమేశ్వరులకు లక్ష పుష్పార్చన
అమావాస్య సందర్భంగా శ్రీ పార్వతీ పరమే శ్వరుల ఉత్సవ విగ్రహాలను కల్యాణ మండ పం వద్ద లక్ష పుష్పార్చనలు ఆలయ ప్రధాన అర్చకు డు పోతులపాటి రామలింగేశ్వరశర్మ ఆధ్వర్యం లో అర్చకుల సహాయంతో వేద మంత్రాల మధ్య ఘనంగా నిర్వహించారు. స్వామివారి లక్ష పు ష్పార్చనను చూసి భక్తులు పుణీతులయ్యారు. అనంతరం గరుడ వాహనంపై స్వామివారిని ఊ రేగించుకుంటూ కోనేరు వద్దకు తీసుకెళ్లి స్వామివారికి పంచ హారతిని సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ చైర్మన్ నల్ల వెంకన్న, ఈఓ సైకం అంజనారెడ్డి, సూపరింటెండెంట్ తిరుపతిరెడ్డి అన్ని వసతులను కల్పించారు. కార్యక్రమంలో దేవాలయ పాలక మండలి సభ్యులు కొల్లోజు శ్రీనివాసులు, గౌలీకర్ శ్రీను, గడ్డం పశుపతి, నాంపల్లి శ్రీను, రాధారపు విజయలక్ష్మి, ఎ మోహన్‌రెడ్డి, బాలెం భిక్షం, మేకల వెంకట్‌రెడ్డి, మర్రి నర్సింహ, గాదె లతీఫ్, రేగట్టె నర్సింహా రెడ్డి, యామ దయాకర్, సహాని, దేవాలయ సి బ్బంది వల్లూరి శంకర్, సూరకంటి ఇంద్రసేనా రెడ్డి, ఇరిగల శ్రీనివాస్‌రెడ్డి, కట్టా రాజయ్య, దేవర లచ్చయ్య, చిక్కుళ్ల వెంకటయ్య పాల్గొన్నారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...