మట్టపల్లి లక్ష్మీనృసింహుడికి ప్రత్యేక పూజలు


Mon,September 10, 2018 03:10 AM

మఠంపల్లి : మండలంలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని తెలంగాణ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి. ర ఘురామారెడ్డి, టి. జగత్‌రెడ్డి, డైరెక్టర్ ట్రాన్స్‌కో ప్రభానందం, జెన్ కో వినోద్‌కుమార్ ఎస్‌పీ జెన్‌కో సురేష్, సీఈ జెన్‌కో వారు ఆదివారం లక్ష్మీనృసింహుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ పి. ఉదయభాస్కర్ సాదరంగా స్వాగతం పలికి శేష వస్ర్తాలతో సత్కరించారు. కార్యక్రమంలో తూటాటి శ్రీనివాసచార్యులు, పద్మనాబాచార్యులు, బదిరీనారాయణచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, వెంకటేశ్వర్లు, డీఈలు వినోద్‌కుమార్, రామ్‌మోహన్‌రెడ్డి, ఏడీ సీహెచ్ గోపాలరెడ్డి, మఠంపల్లి ఏఈ నాగరాజు పాల్గొన్నారు.
శివాలయంలో సీఎండీ రఘుమారెడ్డి ప్రత్యేక పూజలు
మేళ్లచెర్వు : మండల కేంద్రంలోని స్వయంభు లింగేశ్వర స్వామి ఆలయాన్ని తెలంగాణ దక్షిణ ప్రాం త విద్యుత్ పం పిణీ సంస్థ సీ ఎండీ రఘుమారెడ్డి సతీ సమేతంగా ఆదివారం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆల య మేనేజర్ సత్యనారాయణ, అర్చకులు విష్ణువర్ధన్‌శర్మ ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపి ఆలయ చరిత్రను వివరించారు. అనంతరం శాలువతో సత్కరించి స్వామి వారి ఫొటోలను, ప్రసాదాన్ని ఆందజేసి వేదపండితులు రాధాకృష్ణమూర్తి దీవించారు. ఆయన వెంట ట్రాన్స్‌కో డైరెక్టర్ జగత్‌రెడ్డి, జెన్‌కో డైరెక్టర్ సదానందం, సీఈ సురేష్, విజిలెన్స్ ఎస్పీ వినోద్‌కుమార్, సివిల్ ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి, డి.వెంకటేశ్వర్లు, విద్యుత్ అధికారులు రాంమోహన్‌రెడ్డి, నాగరాజు, పిచ్చిరెడ్డి, రవీందర్‌రెడ్డితో పాటు టీఆర్‌ఎస్ నాయకులు హరిలక్ష్మను కుమార్ పాల్గొన్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...