నేరాల నియంత్రణకు నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలి


Sun,September 9, 2018 11:15 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: హుస్నాబాద్ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని హుస్నాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సందెపోగు మహేందర్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయంలో సబ్‌డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, చేర్యాల సర్కిల్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులపై సమీక్ష చేశారు. కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరిగేలా ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించాలన్నారు. ప్రతి కేసులోనూ నాణ్యమైన విచారణ జరపాలన్నారు. వచ్చే ఎన్నికల గురించి ముందస్తు సమాచారం సేకరించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాల విచారణ జరిపితే సులువుగా పూర్తవుతుందన్నారు. ప్రతి శనివారం కోర్టు డ్యూటీ ఆఫీర్లు, పోలీస్ అధికారులతో ఇంటలీజెన్స్ సమావేశం నిర్వహించాలన్నారు. పోలీస్‌స్టేషన్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో మెరుగైన సేవలను అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో నేను సైతం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని, అన్ని గ్రామాల్లో వందశాతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలను నియంత్రించాలన్నారు. రెండు నెలల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావాలన్నారు. సమావేశంలో హుస్నాబాద్, చేర్యాల సీఐలు శ్రీనివాస్‌జీ, రఘు, ఎస్‌ఐలు దాస సుధాకర్, సతీశ్‌కుమార్, పాపయ్యనాయక్, రాజిరెడ్డి, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...