గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల


Sun,September 9, 2018 11:14 PM

- ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం
కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు తెలంగాణ స్టేట్ కేసీఆర్ టీ20 క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ డేగల మణికఠ, కల్వకుంట్ల మల్లికార్జున్ తెలిపారు. అదివారం సిద్దిపేటలోని జయశంకర్ స్టేడియంలో జిల్లా జట్టు కోసం 20క్రీడాకారులను ఎంపిక చేసినట్ల వారు తెలిపారు. మొత్తం 31 జిల్లాల నుంచి 16 టీంలు ఎంపిక చేసి ఈనెల 16 నుంచి 26తేదీ వరకు టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు కేసీఆర్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ నిర్వహించనున్నట్లు వివరించారు. క్రీడాకారుల కోసం భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సదుపాయలు కల్పించారని ఇందుకు మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో క్రికెట్ అసోసియేషన్ సభ్యులు విజయ్, రాజు, బాల్‌రెడ్డి, బాలకిషన్, మహేశ్, ఫమ్మి పాల్గొన్నారు. అనంతరం టోర్నమెంట్ షెడ్యూల్‌ను ఆవిష్కరించారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...