గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి


Sun,September 9, 2018 02:54 AM

-సూర్యాపేట ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు
సూర్యాపేటసిటీ : జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలను ప్రశాంత స్నేహపూరిత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో సూచించారు. గణేశ్ ఉత్సవాలు నిర్వహించే ఉత్సవ కమిటీలు పోలీస్‌స్టేషన్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకొని అనుమతి పొందాలని పేర్కొన్నారు . ఉత్సవాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగేలా డీజేలను అనుమతించేది లేదని, ఉత్సవ కమిటీ సభ్యులు తప్పనిసరిగా మండపాల వద్దనే ఉంటూ ఇతరులకు ఇబ్బందులు కలగకుండా చూ సుకోవాలని సూచించారు. మట్టి విగ్రహాలు ఏర్పాటు చేయడానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని వివరించారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో మైక్ అనుమతులు తీసుకొని భక్తి గీతాలు ఏర్పాటు చేసుకున్నా చుట్టు పక్కల వారికి ఇబ్బందులు లేకుండా రాత్రి 10 గంటల వరకే స్పీకర్లకు అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, మండపాల వద్ద కిరోసిన్, పెట్రోల్ వంటి ఇంధనాలు ఉంచకూడదని, ఫైర్ సెఫ్టీ సిలిండర్, నీళ్ల బాకిట్లువంటి వాటిని అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. పరిసర ప్రాంతాల వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు.

141
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...