నందికొండ టూ శ్రీశైలం


Sun,September 9, 2018 02:54 AM

-లాంచీ ప్రయాణం ప్రారంభం
-110 మందితో శ్రీశైలం బయలుదేరిన లాంచీ
నందికొండ : నందికొండ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం శనివారం ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు 110 మంది పర్యాటకులతో ఉన్న లాంచీని నందికొండ హిల్‌కాలనీ లాంచీస్టేషన్ వద్ద తెలంగాణ టూరిజం వాటర్ ఫ్లూయిట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బాలకృష్ణ, టూరిజం డిప్యూటీ మేనేజర్ సత్యం, అటవీశాఖ డివిజినల్ ఆఫీసర్ గోపి రవిలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ టూరిజం వాటర్ ఫ్లూయిట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బాలకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక నందికొండ నుంచి శ్రీశైలానికి లాంచీలు నడిపించడం ఇది రెండోసారన్నారు. సాగర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా ఇన్‌ఫ్లో రావడంతో ఈ సంవత్సరం నీటి మట్టం 575 అడుగులకు పైన చేరినందున శ్రీశైలానికి లాంచీలను నడిపిస్తున్నట్లు తెలిపారు. పర్యాటకుల భద్రతకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రెండు రోజుల పాటు కొనసాగే ఈ ప్రయాణంలో భోజనం, వసతి, దర్శనం వంటివి అందిస్తున్నట్లు తెలిపారు. లాంచీ ప్రయాణాన్ని వివిధ ప్కాకేజీల రూపంలో పర్యాటకులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి బస్సుల్లో నందికొండకు బస్సుల్లో అక్కడి నుంచి శ్రీశైలానికి లాంచీలో రూ. 3వేలు, నందికొండ నుంచి శ్రీశైలానికి వెళ్లి రావడానికి రూ. 2200, కేవలం శ్రీశైలం పోవడానికి మాత్రం రూ. 1000 చార్జి వసూలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో లాంచీ స్టేషన్ మేనేజర్ హరిబాబు, ఫారెస్ట్ అధికారులు మోహన్, మంగ్తా తదితరులు పాల్గొన్నారు.

135
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...