అక్షరం సమాజహితం కావాలి


Sun,September 9, 2018 02:54 AM

-కలం సృష్టించే అద్భుతం భావితరాలకు స్ఫూర్తినివ్వాలి
-ఉమ్మడి జిల్లా జర్నలిస్టుల శిక్షణ తరగతుల ప్రారంభోత్సవంలో మంత్రి జగదీష్‌రెడ్డి
-జర్నలిస్టులకు రూ.100కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే
-మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
నల్లగొండ కల్చరల్ : జర్నలిస్టులు రాసే వార్తాకథనాల్లోని అక్షర నిర్మాణం ఎంతో గొప్పదని, అది సమాజాన్ని మేల్కొల్పేలా ఉండాలని విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండలోని పోలీసు ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రెండురోజుల శిక్షణ తరగతులను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతికి సంక్షేమ పథకాలను అమలు చేసిన సీఎం కేసీఆర్.. ప్రతీ జర్నలిస్టుకు అక్రిడిటేషన్‌తో పాటు హెల్త్ కార్డును సైతం అందజేశారని తెలిపారు. వచ్చే ప్రభుత్వంలో జర్నలిస్టుల ఇండ్ల సల్థాలు, డబుల్ బెడ్రూమ్‌కు తొలి ప్రాధాన్యం కల్పిస్తామని వెల్లడించారు. తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో జర్నలిస్టులకు రూ.100కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రతి నెల రూ.3వే లు, వారి పిల్లల చదువులకు స్కాలర్‌షిప్ అందిస్తున్నట్లు తెలిపారు.

జర్నలిస్టుల హెల్త్‌కార్డులపై వైద్య ఖర్చులకు ఎలాంటి పరిమితులు లేవని స్పష్టం చేశారు. రూ.20లక్షలకు పైగా వైద్యం హెల్త్‌కార్డు ద్వారా అందుతున్నదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా ఎస్పీ రంగనాథ్, జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి జర్నలిస్టులు వృత్తినైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. మీడియా అకాడమీ కార్యదర్శి రాజమౌళి, మేనేజర్ లక్ష్మణ్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు ఇస్మాయిల్, యూసూఫ్‌బాబు, రియాజొద్దీన్, పౌర సంబంధాల శాఖ ఏడీ శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే(హెచ్143) ఉమ్మడి నల్లగొండ జిల్లాప్రధాన కార్యదర్శి గోలి విజయ్‌కుమార్, యాదాద్రిభువనగిరి, సూర్యాపేట జిల్లాల అధ్యక్షులు గొట్టిపర్తి భాస్కర్, వజ్జె వీరయ్య, సీనియర్ జర్నలిస్టులు కోటగిరి దైవాదీనం క్రాంతి, మర్రి మహేందర్‌రెడ్డి, రేవన్‌రెడ్డి, గుండగోని జయశంకర్, రమేష్‌బాబు, గోళ్ల రమేష్, మక్సూద్, ఐబీసీ ఎండీ ఏచూరి భాస్కర్, సీటీ కేబుల్ ఎండీ మామిడి దుర్గాప్రసాద్, వివిధ పత్రికల బ్యూరోలు, ప్రతినిధులు, ఫొటో, వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...