యాదాద్రిలో భక్తుల సందడి


Sun,September 9, 2018 02:54 AM

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో భక్తుల సందడి నెలకొంది. శ్రావణమాస చివరి శనివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలాల నుంచి భక్తులు రావడం తో శ్రీవారి దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. స్వామివారి నిత్యకల్యాణం, అష్టోత్తరాలు, వ్రతపూజలలో మొక్కులు తీర్చుకున్నారు. బాలాలయంలోని ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. ప్రతిరోజు నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కళ్యాణ తంతును జరిపారు. అష్టోత్తర పూజలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. శ్రీవారి ముఖ మండపంలో స్వామివారిని దర్శించుకున్నామన్న ఆనందం ఈ పూజలతో భక్తులకు కలుగుతుం ది. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన, పుష్కరిణి వద్ద కొలువై ఉన్న క్షేత్ర పాలక ఆంజనేయస్వా మివారికి జరిగిన పూజ ల్లో కూడా భక్తులు పాల్గొన్నారు. వ్రత మండపంలో శ్రీసత్యనారాయణస్వామి వ్రత పూజల్లో భక్తు లు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి ఖజానా లెక్కింపు
శ్రీవారి ఖజానాకు రూ. 24, 92, 401 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 2, 18, 596, 100 రూపాయల టిక్కెట్‌తో రూ. 62, 500, 150 రూపాయల టిక్కెట్‌తో రూ. 4, 38, 900, కల్యాణకట్ట ద్వారా రూ. 72, 000, వ్రత పూజల ద్వారా రూ. 3, 51, 500, ప్రసాద విక్రయాలతో రూ. 8, 91, 510, గదుల విచారణ శాఖ ద్వారా రూ.1, 01, 440, శాశ్వత పూజల ద్వారా రూ. 29, 232 తో పాటు మిగతా అన్నివిభాగాల నుంచి శ్రీవారి ఖజానాకు రూ. 24, 92, 401 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...