మెరుగైన సదరం


Sun,September 9, 2018 02:53 AM

- జిల్లాలో 26,683 మందికి సర్టిఫికెట్లు
-పింఛన్లు పొందుతున్నది 21,785మంది
-కొత్తజిల్లా ఏర్పాటు తర్వాత 7650మందికి పరీక్షలు
-ప్రతి నెలా వైద్య నిపుణులచే నిర్వహణ
-హర్షం వ్యక్తం చేస్తున్న దివ్యాంగులు
-దళారులను నమ్మి మోసపోవద్దంటున్న అధికారులు
చివ్వెంల : నూతన జిల్లా ఏర్పాటుకు ముందు నుంచి ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 26683మంది సదరం సర్టిఫికెట్లు పొందారు. వీరిలో శారీరక వికలాంగులు 16614మంది, వినికిడి సంబంధించిన వారు 1691, కంటి చూపునకు సంబంధించి 2851మంది, మానసిక వికలాంగులు 2714మంది, మానసిక రుగ్మత గలవారు 2606మంది, బహుళ వైకల్యం కలిగినవారు 207మంది ఉన్నారు. జిల్లాలో 21,785మంది పింఛన్ పొందుతున్నారు. వీరికి ప్రతి నెలా రూ.1500చొప్పున రూ.3.26కోట్లు అందుతున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సదరం క్యాంపు ద్వారా అందిస్తున్న సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు 7650మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 3279మందికి ధ్రువపత్రాలు అందజేశారు. శారీరక దివ్యాంగులు 4323మంది దరఖాస్తు చేసుకోగా 1865మందికి, కంటిచూపునకు సంబంధించి 1668దరఖాస్తులకు 473, చెవిటివారు 772మంది దరఖాస్తు చేసుకోగా 230మందికి, మానసిక వికలాంగులు 292మందికి 218, మానసిక రుగ్మత గలవారు 592మందిలో 491మందికి, బహుళ వికలాంగులు ముగ్గురు దరఖాస్తు చేసుకోగా ఇద్దరికి సర్టిఫికెట్లు అందజేశారు.

ప్రతి నెలా పింఛన్లకు రూ.3.26కోట్లు..
జిల్లాలో సదరం ద్వారా సర్టిఫికెట్ పొందినవారు 26,683మంది ఉండగా వీరిలో ప్రభుత్వోద్యోగులు, ఆర్థికంగా ఉన్నవారు 4,898మంది ఉన్నారు. మిగతా 21,785 మంది ప్రతి నెలా రూ.3కోట్ల 26లక్షల 77వేల 500 ఆసరా పొందుతున్నారు. వీరిలో శారీరక వికలాంగులు 13,212మంది, వినికిడిలోపం గలవారు 1402మంది, కంటిచూపునకు సంబంధించి 2522మంది, మానసిక వికలాంగులు 2504మంది, మానసిక రుగ్మత గలవారు 2005మంది, బహుళ వైకల్యం గల వారు 140మంది ప్రతినెలా ఒక్కొక్కరు రూ.1500 లబ్ధి పొందుతుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. సదరం సర్టిఫికెట్ పొందడానికి దివ్యాంగులు నేరుగా సంప్రదించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు.

నెల రోజుల్లో సర్టిఫికెట్ జారీ
సదరం క్యాంపులో దరఖాస్తు చేసుకొని వైద్య పరీక్షల అనంతరం అర్హులైన ప్రతి ఒక్కరికీ నెల రోజుల్లోనే ధ్రువపత్రాలు అందజేస్తాం. ప్రతి నెలా వైద్యులచే సదరం క్యాంపులు నిర్వహిస్తున్నాం. సదరం క్యాంపు కోసం ప్రత్యేక షెడ్ నిర్మాణానికి కుర్చీలు, ఫర్నిచర్ కోసం విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖల మంత్రి నిధులు కేటాయించారు. సదరం క్యాంపునకు హాజరయ్యే వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రతి నెలా క్యాంపు నిర్వహిస్తున్నాం. దివ్యాంగులు క్యాంపును నేరుగా సంప్రదించాలి. దళారులను నమ్మి మోసపోవద్దు.
- కిరణ్‌కుమార్, డీఆర్‌డీఓ పీడీ
పెంచిన పింఛన్‌తో ఇల్లు గడుస్తున్నది
గతంలో ఇచ్చిన పింఛన్ ఏ అవసరానికి ఉపయోగపడలేదు. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు రూ.1500లు పింఛన్ అందించి మమ్ములను ఆర్థికంగా ఆదుకుంటుంది. పింఛన్‌తో ఇల్లు గడుస్తుంది. మాకు పింఛన్ పెంచిన సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్‌రెడ్డిలకు ధన్యవాదాలు. దివ్యాంగులమంతా ప్రభుత్వానికి రుణపడి ఉంటాము.
-ఎండీ జహీర్‌బాబా, ఆత్మకూర్.ఎస్

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...