విద్యానికేతన్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం


Sat,September 8, 2018 11:44 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ : పట్టణంలోని ప్రగతి విద్యానికేతన్‌లో శనివారం 1997-98 బ్యాచ్ 7వ తరగతి విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా నాడు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడంతో పాటు నాటి సృతులను గుర్తు చేసుకున్నారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల తర్వాత తాము మొదటి సారిగా కలుసుకున్నట్లు తెలిపారు. పూర్వ విద్యార్థుల్లో సమస్యలతో ఉన్న వారిని గుర్తించి వారిని ఆదుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే తమ బ్యాచ్ ద్వారా చదువుల్లో ఉత్తమ ప్రతిభ చూపిస్తున్న పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. విద్యార్థి స్థాయిలో చదువులపై శ్రద్ధ వహిస్తే తప్పక ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

137
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...