టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయం


Sat,September 8, 2018 11:44 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ : జనగామ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని, శనివారం జనగామ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో చేర్యాల పట్టణ, మండల నాయకులు కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డిని మరోమారు అత్యధిక మెజార్టీతో గెలిపిచేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం చేర్యాలలో టీఆర్‌ఎస్ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సుంకరి మల్లేశం, పార్టీ అధికార ప్రతినిధి పుర్మ ఆగంరెడ్డి మాట్లాడుతూ ముత్తిరెడ్డికి రెండోసారి టికెట్ ఇవ్వడంతో నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ముత్తిరెడ్డి నియోజకవర్గంలోనే పర్యటిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ కొన్ని మాసాల ముందు ఎన్నికలకు వెళ్తుండడంతో ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోవడం లేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు అఖండ విజయం సాధించడం ఖాయమన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎర్రోల్ల రామచంద్రం, మండల ప్రధాన కార్యదర్శి నర్ర ఐలయ్య, నాయకులు ఆరోగ్యరెడ్డి తదితరులు ఉన్నారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...