వెలుగులు నింపుతున్న కంటి వెలుగు


Sat,September 8, 2018 11:44 PM

-మూడు మండలాల్లో 8,202 మందికి పరీక్షలు
-2,439 మందికి కంటి అద్దాల పంపిణీ
-1,037 మందిని శస్త్ర చికిత్సలకు రెఫర్
- 6 గ్రామాల్లో పరీక్షలు పూర్తి
- ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు
చేర్యాల, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అ నూహ్య స్పందన లభిస్తున్నది. పథకం ప్రారంభించినప్పటి నుంచి గ్రామీణ ప్రజల జీవితాల్లో కంటి వెలుగు పథకం వెలుగులు నింపుతున్నది. మూడు మండలాల పరిధిలో 8,202 మందికి పరీక్షలు జరిపి, 2,439 మందికి కంటి అద్దాలు పం పిణీ చేయడంతో పాటు 1,037 మందికి శస్త్ర చికిత్సల కోసం పై దవాఖానలకు సిఫారస్ చేశారు. చేర్యాల పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో కంటి వెలుగు పరీక్షలు కొనసాగుతుండగా, కొమురవెల్లి మండలంలోని కొమురవెల్లి, రసూలబాద్, గౌరాయపల్లి గ్రామాల్లో కంటి వెలుగు శిబిరం ముగిసింది. మద్దూరు మండలంలోని మర్మాముల, ధర్మారం, ధూ ళ్మిట్ట గ్రామాల్లో కంటి వెలుగు పరీక్షలను సంబంధిత శాఖ అధికారులు పూర్తి చేశారు.

చేర్యాలలో 3,376 మందికి పరీక్ష లు నిర్వహించి, 705 మందికి అద్దాలు ఇవ్వడంతో పాటు 278 మందిని శస్త్ర చికిత్సలకు రెఫర్ చేసినట్లు వైద్యురాలు అ మీనాతబస్సుం తెలిపారు. మద్దూరు మండలంలో 2,117 మందికి పరీక్షలు నిర్వహించి 464 మందికి అద్దాలు ఇచ్చి, 325 మం దిని పైదవాఖానలకు పంపించినట్లు వైద్యుడు రాజు తెలిపారు. కొమురవెల్లి మం డలంలో 2,709 మందికి పరీక్షలు నిర్వహించి 1,270 మం దికి అద్దాలు ఇవ్వడంతో పాటు 434 మందిని శస్త్ర చికిత్సలకు పంపించినట్లు వైద్యుడు అనిల్ పేర్కొన్నారు. గ్రా మాల వారీగా వైద్య సిబ్బంది ముందుగా నిర్ణయించుకున్న మేరకు రోజుకు 250 మంది చొ ప్పున పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కొనసాగుతున్న పరీక్షలు
చేర్యాల పట్టణంతో పాటు, కొమురవెల్లి, మద్దూరు మండలాల్లోని గ్రామంలో పరీక్షలు కొనసాగుతున్నాయి. శాసన మం డలి విప్ బొడెకుంటి వెంకటేశ్వర్లు, మజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, మల్లన్న ఆలయ చైర్మన్ సెవెల్లి సంపత్, కొమురవెల్లి తహసీల్దార్ ఎం.భిక్షపతి శిబిరంలో పరీక్షలు పర్యవేక్షిస్తున్నారు. అలాగే కంటి వెలుగు శిబిరానికి వచ్చిన ప్రజలకు చేసిన పరీక్షలు, వారికి ఇచ్చిన మందులు, అద్దాలు తదితర వాటిని వైద్య సిబ్బంది ట్యాబ్స్‌లో నమోదు చేసి ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఉ న్నతాధికారులకు పంపిస్తున్నారు.

సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు
గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు పథకం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు వారి గ్రామాల్లోనే నిర్వహిస్తుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...