ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకోండి


Sat,September 8, 2018 11:43 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : ఎన్నికల నియమావళిపై ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 10 ఈవీఎం మిషన్లు తెప్పించి విస్తృత స్థాయిలో ఈవీఎంల పనితీరుపై ఓటర్లకు వివరించాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఆర్‌వో చం ద్రశేఖర్, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ రామచంద్రంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ మాట్లాడుతూ రానున్న నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరపనున్నందున అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈవీఎం మిషన్లు, గోదాములు, ఓటర్ల జాబితా తదితర సమాచారం పూర్తిగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు.గోదాములను క్షేత్రస్థాయిలో సందర్శించి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ మేరకు జిల్లాలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల గురించి చర్చించారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కృష్ణభాస్కర్‌ను ఎన్నికల అధికారి ఆదేశించారు. త్వరలోనే హైదరాబాద్‌లో ఆర్‌వో, ఈఆర్‌వోలకు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషనరీ, వీవీపీ ఏటి ఎలక్టోరల్ రోల్స్ తదితర అంశాలపై వర్క్‌షాప్‌లో తెలుసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల టెక్నికల్ అధికారి చిరంజీవి, సిద్దిపేట జిల్లా ఎన్నికల నిర్వహణ సిబ్బంది, డివిజనల్ టెక్నికల్ మేనేజర్ విజయ్‌కుమార్, ఎలక్షన్ ఐటీ సపోర్టర్ శ్రీనివాస్, వైస్ కో ఆర్డినేటర్ నర్సింహ పాల్గొన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...