ప్రజా నాయకుడు రామలింగారెడ్డి


Sat,September 8, 2018 11:43 PM

దుబ్బాక టౌన్ : టీఆర్‌ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భారీ మెజార్టీతో గెలువాలని నీలకంఠ యువజన సంఘం ఆధ్వర్యంలో శనివారం పట్టణం లోని నీలకంఠేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు మర్గల సత్యానందం, నాయకుడు కాల్వ శ్రీనివాస్‌లు మాట్లాడుతూ... రామలింగారెడ్డిని వచ్చే ఎన్నికల్లో గతంలో కంటే భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. పూజలు నిర్వహించిన వారిలో నీలకంఠ యువజన సంఘం నేతలు బోడ చందూ, మర్గల రాజేష్, నరేశ్ ఉన్నారు.
భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం..
రాయపోల్ : రామలింగారెడ్డిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అనాజీపూర్ గ్రామ టీఆర్‌ఎస్ నాయకులు శ్రీధర్, రాంచంద్రంగౌడ్, బాల్‌రాజ్‌గౌడ్ తదితరులు పేర్కొన్నారు. ఈ మేరకు రామలింగారెడ్డిని కలిసి శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు భూమయ్య, భార్గవ్, జోడు నర్సింలు, బెస్త వెంకటి, సిద్దిరెడ్డి, ఇస్తారి పాల్గొన్నారు.
యాదగిరిగుట్టలో మొక్కు చెల్లింపు
రాయపోల్ : రామలింగారెడ్డికి తిరిగి టిక్కెట్ రావడంతో దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్త ముదురకోళ్ల యాదగిరి.. యాదగిరిగుట్ట ఆలయంలో మొక్క చెల్లించుకున్నారు.
మిరుదొడ్డి : రామలింగారెడ్డి.. ప్రజల నాయకుడని.. అయన్ను తిరిగి ఎమ్మెల్యేగా గెలిపిస్తామని కాసులాబాద్ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నేతలు పేర్కొ న్నారు. సిద్దిపేటలో మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నేతలు కీసరి శ్రీనివాస్, నగేశ్, నవీన్ ఉన్నారు.
ఎమ్మెల్యేకు స్వాగతం పలికిన కార్యకర్తలు
తొగుట : మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డిని మండల నాయకలు బైక్ ర్యాలీగా వెళ్లి మిరుదొడ్డి మండలం అక్బర్‌పేట వద్ద కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మ న్ కనకయ్య, మాజీ సర్పంచ్‌లు అంజమ్మప్రతాప్‌రెడ్డి, టి.ఎల్లం, అనితానర్సింలు, కవితాకొమురయ్య ఉన్నారు.
టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకుడు
కాన్గల్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు దొమ్మాట మల్లయ్య, మాందారం మల్లయ్యలు తమ అనుచరులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కవిత కొమురయ్య, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మీనారాయణ తదితరులున్నారు.
ఎనగుర్తిలో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ...
దుబ్బాక, నమస్తే తెలంగాణ : మండలంలోని ఎనగుర్తిలో కౌండిన్యసేన, గౌడ సంఘం ప్రతిష్ఠించిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో నేతలు లింబాద్రిగౌడ్, జైహింద్‌గౌడ్, జ్యోతి గౌడ్, ఉపేందర్‌గౌడ్, ఈశ్వర్‌ప్రసాద్‌గౌడ్ పాల్గొన్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...