లోక్ అదాలత్‌లో 1882 కేసుల పరిష్కారం


Sat,September 8, 2018 11:42 PM

సంగారెడ్డి టౌన్: లోక్‌అదాలత్‌లో 1882 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికల్యాణ్ చక్రవర్తి తెలిపారు. శనివారం జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాలతో ఉమ్మడిజిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి యం. భవాని ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ సివిల్ కేసులు 14, ఎంవీవోపీ కేసులు 19, క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు 770, బ్యాంకు రికవరీ కేసులు 51, విద్యుత్ చౌర్యం కేసులు 1012, ఎల్‌ఏవోపీ కేసులు 6, ఈపీ కేసులు 2, చెక్‌బౌన్స్ కేసులు 8 మొత్తం 1882 కేసులను పరిష్కరించామని తెలిపారు. సివిల్, ఎంవీవోపీ, క్రిమినల్ కాంపౌండబుల్ కేసులకు సంబంధించి నష్టపరిహారం రూ.69.55లక్షలను ఇప్పించడం జరిగిందన్నారు. బ్యాంకు రికవరీ కింద రూ.33లక్షలు, విద్యుత్ చౌర్యం కేసులలో జరిమానా రూ.11.10లక్షలు, ఎల్‌ఏవోపీ కేసులకు నష్టపరిహారం రూ.1,52, 33, 378లు, చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి రూ.3, 21, 35, 000 కోట్లను రికవరీ జరిగిందన్నారు. ఈ జాతీయ లోక్‌అదాలత్‌లో జిల్లా ఏడో అదనపు న్యాయమూర్తి ఐ.శైలజదేవి, సీనియర్ సివిల్ జడ్జీలు యం.భవాని, శ్యాంశ్రీ, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి విజయసారధి రాజు, అదనపు ప్రథమశ్రేణి కోర్టు సీహెచ్ సునందమ్మ, స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి అన్నపూర్ణ, స్పెషల్ ఎక్సైజ్ కోర్టు జడ్జి సునీతారాణి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నర్సింగరావు పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...