అభివృద్ధివైపే..

Wed,January 11, 2017 02:13 AM

-తప్పుడు విధానాలతో కనుమరుగవుతున్న కమ్యూనిస్టులు
-దేశ చరిత్రలో రాష్ట్రంలో రికార్డుస్థాయి అభివృద్ధి
-హామీ ఇవ్వనివి కూడా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి
-మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
-సీపీఎం, సీపీఐ నుంచి టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు

సూర్యాపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : దేశ చరిత్రలోనే అతి స్వల్పకాలంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటితో పాటు.. హామీ ఇవ్వని కొత్త పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కు తుందని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుం టకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. జిల్లాలోని సీపీఎం, సీపీఐలకు చెందిన నాయకులు, కార్యకర్తలు 1500కు పైనే ఆ యా పార్టీలకు రాజీనామాలు చేసి మంగళవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద టీఆర్‌ఎస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి జగదీష్‌రెడ్డితో పాటు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంలు పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న సూర్యాపేటలో ఎమ్మెల్యేలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉండేవారని అయితే రానురాను వారి విధానాల్లో మా ర్పులు రావడం..తుప్పుపట్టిన సిద్ధాంతాలతో అభివృద్ధ్ది నిరోధకులుగా మారడంతో ఆ పార్టీలు నేడు కనుమరుగయ్యే స్థాయికి వచ్చిందని ఎద్దేవా చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుంటే అక్కడికి ఎలాంటి సంబంధం లేని కమ్యూనిస్టులు వెళ్లి ప్రజలను రెచ్చగొడుతూ నిర్మాణాన్ని అడ్డుకునే యత్నం ఆందోళనలు, ఘర్షణలకు దారితీసేలా కుట్రలు పన్నుతూ అభివృద్ధ్ది నిరోధకులుగా మారారని గుర్తు చేశారు.

రూ.35వేల కోట్లతో సంక్షేమ పథకాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా కేవలం సంక్షేమ పథకాల కోసం రూ.35వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణది అని తెలిపారు. అయితే తెలంగా ణ రాష్ట్రంలో ఏర్పాటైన మొదటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం రెండున్నరేళ్లలోనే మేనిఫెస్టోను వందశాతం అమలు చేయడమే కాదు మేనిఫెస్టోలో లేని కల్యాణలక్ష్మి, షాదీముబారక్, విద్యార్థులకు సన్నబి య్యం తదితర అనేక కొత్త పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అలాగే 2018 నాటికి శ్రీరాంసాగర్ కాల్వల ద్వారా జిల్లాలోని దాదాపు రెండున్నర లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీటిని అందించి తీరుతామని తదనుగుణంగా పనులు జరుగుతున్నాయన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు అధికారంలో ఉన్న పార్టీలన్నీ తెలంగాణకు ద్రోహం చేసి.. నాశనం చేసినవేనని ఇప్పటికే అదే పార్టీ ల్లో ఉండలేకఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరుతున్న నేపథ్యంలో నేడు సీపీఎం నుంచి సీనియర్ నాయకులు నూకల మధుసూదన్‌రెడ్డి, వెంపటి గురూజీలతో పాటు వందలాది మంది కార్యకర్తలు చేరడం పట్ల వారికి అభివృద్ధి పట్ల ఉన్న మక్కువ తెలుస్తుందన్నారు. ఇంకా ద్రోహుల పార్టీల్లో ఉన్న కొద్దిపాటి నాయకులు కూడా చాలా వరకు మనసు చంపుకొని ఉంటున్నారు. అలాంటి వారు టీఆర్‌ఎస్‌లోకి రావాలని మంత్రి ఆహ్వానం పలికారు.

అభివృద్ధ్దికి దూరంగా కమ్యూనిస్టు గ్రామాలు :ఎమ్మెల్యే వేముల గతంలో కమ్యూనిస్టు పార్టీలు ప్రజాప్రతినిధులుగా ఉన్న గ్రామాల్లో అభివృద్ధ్ది శూన్యంగా ఉండేది... తరచూ గొడవలు... కొట్లాటలు కేసులు..బెయిల్‌కే పరిమితమయ్యాయని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. అయితే నేడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అభివృద్ధే ఎజెండాగా పాలన జరుగుతుండడంతో అన్ని పార్టీలతో పాటు ఉన్న కొద్దిపాటి కమ్యూనిస్టులు కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. గతంలో గొడవలు, ఘర్షణలకు నెలవైన గ్రామాలు నేడు మంత్రి జగదీష్‌రెడ్డి నేతృత్వంలో అభివృద్ధ్దితో సస్యశ్యామలంగా వెలుగొందుతున్నాయన్నారు.

ప్రతి నాయకుడు, కార్యకర్తలను కాపాడుకునే గుణం మన జగదీష్‌రెడ్డికి ఉందన్నారు. కో దాడ మార్కెట్ కమిటీ చైర్మన్, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్ చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ కొంతమేర కమ్యూనిస్టులకు బలంగా ఉన్న గ్రామాలు నేడు టీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నారని ఇప్పటికే మోతె మండలం దాదాపు ఖాళీ కావచ్చిందన్నారు. రానున్న రోజుల్లో చిలుకూరు, మునగాల తదితర మండలాలను టీఆర్‌ఎస్ వశం చేస్తానని దీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళికాప్రకాష్, పట్టణ పార్టీ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, వై.వెంకటేశ్వర్లు, బడుగుల లింగయ్యయాదవ్, కట్కూరి గన్నారెడ్డి తదితరులు ఉన్నారు. పార్టీలో చేరిన వారిలో సీపీఎం నాయకులు నూకల మధుసూదన్‌రెడ్డి, వెంపటి గురూజీ, ఎలమంచి, మోతె వైస్ ఎంపీపీ శివరంజన్‌లతో పాటు సూర్యాపేట, మోతె, చివ్వెంల, మునగాల, చిలుకూరు మండలాలకు చెందిన సుమారు 1500ల మంది ఉన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...