వైభవంగా శ్రీవేణుగోపాలస్వామి శోభాయాత్ర


Wed,January 11, 2017 02:11 AM

హుజూర్‌నగర్‌టౌన్ : జిల్లాలో అత్యంత పురాతనమైన శ్రీవేణుగోపాల సీతారామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసోత్సవాల్లో అత్యంత రమణీయంగా ఎనిమిది రకాల వాహనాలపై స్వామి వారిని, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి శోభాయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆలయం నుంచి పాతబస్టాండు వరకు జరిగిన శోభాయాత్రలో వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 108 దివిటీల వెలుగులో మహిళల కోలాటాల నడుమ వేద పఠనాలతో శోభాయాత్ర కన్నులపండువగా నిర్వహించారు.

అర్చకులు శ్రీనివాసాచార్యులు, రామలక్ష్మణాచార్యులు, దామోదరాచార్యులు, స్వామివార్లపై కీర్తనలు ఆలపించారు. శోభాయాత్ర సందర్భంగా రామాలయాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకట అప్పలాచార్యులు, ఈఓ కొండారెడ్డి, పట్టణ ప్రముఖులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS