శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు

Wed,January 11, 2017 02:11 AM

మునగాల : గ్రామాల్లో శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ ఎ.రమణారెడ్డి అన్నారు. మంగళవా రం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. నేరాల నియంత్రణకు, ప్రమాదాల నివారణకు పోలీసులకు ప్రతిఒక్కరూ సహకరించాలని అన్నారు. గ్రామ స్థాయిలో నేరాలు అదు పు చేయడానికి, సమస్యలను గ్రామస్థాయిలో పరిష్కరించటానికి వీపీఓల దృష్టికి తీసుకురావాలని అన్నారు. ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసులే గాని, నేరస్తులకు కాదని అ న్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజల సమస్యలపై పోలీసులు స్పందిస్తారని అన్నారు. సామాన్య వ్యక్తికి న్యాయమందేలా పోలీసు వ్యవస్థ కృషిచేస్తుందని అన్నారు. నేరాలు అదుపు చేయడానికి, రోడ్డు ప్రమాదాల్లో వాహనాలను గుర్తించటానికి గ్రామ వీధుల్లో, జాతీయ రహదారిపై ప్రజల స హకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఎస్‌ఐ నగేష్‌కు సూచించారు. అనంతరం సిబ్బందికి సమస్యలపై తీసుకోవలసిన జాగ్రత్తలు, ఉద్యోగ బాధ్యతలపై సూచనలు అందజేశారు. సమావేశంలో రూరల్ సీఐ మధుసూదన్‌రెడ్డి, ఏఎస్‌ఐలు అహ్మద్ జాని, వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

నడిగూడెం : శాంతిభద్రతల పరిరక్షణలో రాజిపడేదిలేదని కోదాడ డీఎస్పీ రమణారెడ్డి అన్నారు. మంగళవా రం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్‌శాఖ అంటే అద్భుతాలు సృష్టించడం కాదు. ప్రజల శాంతిభద్రతలకు వి ఘాతం కలగకుండ ప్రజలతో స్నేహ పూర్వకంగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నట్లు ఆ యన తెలిపారు. డివిజన్‌లోని ప్రతి గ్రామంలో పోలీస్ అధికారి కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు పోలీస్ శాఖకు వారధిగా పనిచేస్తుందన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రూరల్ సీఐ మధుసూదన్‌రెడ్డి, ఎస్‌ఐ నా రాయణరెడ్డి ఆయనతో పాటు ఉన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...