నగదు రహిత లావాదేవీలు చేసుకోవాలి

Wed,January 11, 2017 02:10 AM

చిలుకూరు : నగదు రహిత లావాదేవీలు చేసుకోవాలని స్థానిక తహసీల్దార్ కొల్లు దామోదర్‌రావు అన్నారు. మండలంలోని నారాయణపురంలో నగదు రహిత లావాదేవీల్లో భాగంగా గ్రామస్తులకు నూతనంగా బ్యాంకు అకౌంట్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు నగదు రహిత లావాదేవీలు నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఇసాక్‌హుస్సేన్, సర్పంచ్ సుల్తాని లక్ష్మి, కీసరకొండలు, గ్రామ కార్యదర్శి పూల శ్రీనివాస్ పాల్గొన్నారు.

మునగాల : నగదురహిత లావాదేవీలు నిర్వహించడానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఎన్‌ఎస్‌ఎస్ కారకచక్రమ అధికారి జె.వీరయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని నారాయణగూడెంలో నడిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్ ర్యాలీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి నగదు రహితం కోసం అపోహలు తొలగిపోయే విధంగా విద్యార్థులు కృషిచేయాలని అన్నారు. హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడుగుంతల నిర్మాణం, పరిసరాలు పరిశుభ్రత తదితర అంశాలపై గ్రామస్తులకు అవగాహన నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈఓ రామారావు, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, నాగేశ్వర్‌రావు, శ్రీధర్ పాల్గొన్నారు.

22
Tags

More News

మరిన్ని వార్తలు...