రక్తదానం శిబిరం నిర్వహించడం అభినందనీయం


Wed,January 11, 2017 02:10 AM

మునగాల : రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని జడ్పీటీసీ కోల ఉపేందర్ అన్నారు. మంగళవా రం మండల పరిధిలోని రేపాలలో అక్షర సామాజిక సేవా సంఘం ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సూర్యాపేట వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేటి సమాజంలో రక్తదానానికి మించిన దానం మరొకటి లేదని అన్నారు. రక్తదానం చేసిన వారికి గ్రామానికి చెందిన గుడిపుడి.వెంకటేశ్వర్‌రావు రూ.5 వేల ఆర్థిక సాయంతో పాటు పండ్లను పం పిణీ చేశారు. ఈ సందర్భంగా నలబై మంది యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ భద్రయ్య, సర్పంచ్‌లు చెవుల వెంకన్న, సైదాబి, ఎంపీటీసీ బత్తుల ఉష శ్రీనివాస్, వైద్యాధికారి వెంకటపాపిరెడ్డి, షాబుద్దీన్, శశికళ, కోటేశ్వరి, రమేష్, శ్రీను, అప్పయ్య శాస్త్రి పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS