సంస్కృతి, సంప్రదాయలను రక్షించుకోవాలి


Wed,January 11, 2017 02:10 AM

కోదాడ, నమస్తే తెలంగాణ : సంస్కృతి, సంప్రదాయలను రక్షించుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని సిటీ సెంట్రల్ స్కూల్స్ చైర్మన్ రావిళ్ల నాగేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం కోదాడలోని సిటీ సెంట్రల్ స్కూల్ ఆవరణలో ముందస్తుగా సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో గంగిరెద్దుల విన్యాసాలు అలరించాయి. ముగ్గుల పోటీలు నిర్వహించారు. వి జేతలకు ఆయన బహుమతులందజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కోదాడ, నమస్తేతెలంగాణ :మాస్టర్‌మైండ్స్ పాఠశాలలో.. కోదాడలోని మాస్టర్ మైం డ్స్ పాఠశాలలో మంగళవారం సంక్రాంతి సంబురాలు ని ర్వహించారు. రంగవల్లుల పోటీలు, పతంగుల పోటీలు, గంగిరెద్దు ఆటలు, హరిదాసు కీర్తనలు అలరించాయి. ప్రిన్సిపాల్ పొట్టా కిరణ్‌కుమార్, కన్వీనర్ జగన్‌మోహన్‌రావు బహుమతులందజేశారు. కార్యక్రమంలో నూకల వెంకట్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS