నూరుశాతం నగదు రహిత గ్రామంగా అంజలీపురం


Wed,January 11, 2017 02:10 AM

హుజూర్‌నగర్‌టౌన్ : మండలంలో నూరుశాతం నగదు రహిత గ్రామంగా అంజలీపురం గ్రామాన్ని ఎంపిక చేశారు. మంగళవారం గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా క్లస్టర్ అధికారి ఏఓ రాజగోపాల్, ఎంపీడీఓ శ్రీరామకృష్ణ, తహసీల్దార్ రవి మాట్లాడుతూ గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన వారిలో ఎకౌంట్‌లేని వారిని గుర్తించి గ్రామంలో ఉన్నవారందరికి బ్యాంకు కరస్పాండెంట్ వెంకన్న ద్వారా అకౌంట్లు ఇప్పించామన్నారు. గ్రామంలో నగదు రహిత ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేందుకు రెండు పీఓఎస్ మిషన్లు మంజూరయ్యాయని, ఇవి కావాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అకౌంట్లు కలిగిన వారందరికి త్వరలో డెబిట్ కార్డులు ఇప్పించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. కార్యక్రమంలో గిర్దావర్ నర్సయ్య, సర్పంచ్ అల్లీపురి శోభ, ఉపసర్పంచ్ సుబ్బారెడ్డి, నాయకులు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS