దేశ భవిష్యత్ యువతపైనే


Wed,January 11, 2017 02:09 AM

సూర్యాపేటటౌన్ : భారత దేశ భవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ నల్లగొండ ప్రచారక్ ఎన్.వి.శివకుమార్ అన్నారు. స్వామి వివేకానంద 154వ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని సాయిబాలాజీ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి యువత ఉ న్నత స్థాయి విద్యతో పాటు నైతిక మానవతా విలువలను అలవర్చుకోవాలన్నారు. స్వామి వివేకానంద చూపిన బాటలో యు వత పయనించాలని కోరారు. స్వామి వివేకానంద జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు అంగిరేకుల నాగార్జున, ప్రధాన కార్యదర్శి నాగవెల్లి ప్రభాకర్, డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, చకిలం రాజేశ్వర్‌రావు, తలమల్ల హసేన్, తోట శ్యాంప్రసాద్, గోపాల్‌దాసు శ్రీరాములు, పర్వతం శ్రీధర్, గజ్జల వెంకట్‌రెడ్డి, అంతటి శ్రీనివాస్, గజ్జల వెంకట్‌రెడ్డి, బాలనర్సయ్య, పట్టణంలోని పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS