జాతీయస్థాయి క్రీడాకారులను అభినందించిన మంత్రి


Wed,January 11, 2017 02:09 AM

కుడకుడరోడ్డు : జాతీయస్థాయి బా క్సింగ్ పోటీల్లో అండర్-17 విభాగం లో రెండుసార్లు విరోచితంగా పోరాడిన నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ము లు కొండ సాయికిరణ్, కొండ సాయిచరణ్‌ను రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖమాత్యులు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేం ద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసిన వారితో మం త్రి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒకే కుటుంబానికి చెంది న ఇద్దరు పోటాపోటీగా పాల్గొనడం గర్వకారణమన్నారు.

రెండుసార్లు జాతీయ స్థాయిలో పోరాడి కొండ సాయిచరణ్ ఇటీవల చెన్నైలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో రజత పథకం గెలుపొందడం, అలాగే త్వరలో ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో సబ్ జూనియ ర్ విభాగంలో తెలంగాణ నుంచి ఎంపికవడం అభినందనీయమన్నారు. ఇటువంటి పోటీల్లో పాల్గొని తమ కుటుంబంతో పాటు రాష్ర్టానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమం లో నకిరేకల్ ఎ మ్మెల్యే వేముల వీరేశం, పట్టణ అధ్యక్షుడు నిమ్మ ల శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వర్లు, బడుగుల లింగయ్యయాదవ్, కట్కూరి గన్నారెడ్డి, మారిపెద్ది శ్రీనివాస్, గండూరి ప్రకాష్, యాదగిరి పాల్గొన్నారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS