గాంధీనగర్‌లో ముగిసిన ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం


Wed,January 11, 2017 02:09 AM

సూర్యాపేటరూరల్: మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు వారం రోజులుగా నిర్వహిస్తున్న శీతాకాల ప్రత్యేక శిబిరం మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సర్పంచ్ వట్టె రేణుక మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు వారం రోజులు శిబిరం ఏర్పాటు చేయడం పట్ల అభినందించారు. అనంతరం గ్రామంలోర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అవిలయ్య, ప్రోగ్రాం ఆఫీసర్ సురేష్‌కుమార్, అధ్యాపకులు లింగరాజు, కుమారస్వామి, రవీందర్, వెంకట్రాములు, పంచాయతీ కార్యదర్శి సంజీవ, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు రఫీ, చాంద్‌పాష పాల్గొన్నారు.

14
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS