వీబీకేలకు కనీస వేతనాలు అందజేయాలి


Wed,January 11, 2017 02:08 AM

బొడ్రాయిబజార్ : గ్రామాల్లో సంఘబంధాల్లో పని చేస్తున్న వీబీకేలకు ప్రభుత్వం కనీస వేతనాలు ఇచ్చి పర్మినెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి యాదగిరిరా వు డిమాండ్ చేశారు. స్థానిక ఎంవీఎన్ భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన వీబీకేల జిల్లా సమావేశంలో ఆయ న మాట్లాడారు. 2010 నుంచి 16 యేళ్లుగా పనిచేస్తున్న వారిని ప్రభుత్వం పట్టించుకోకుండా ని ర్లక్ష్యం చేస్తుందన్నా రు. ఇప్పటికి 40నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వీబీకేలకు జీతాలు చెల్లించకుండా పర్మినెంట్ చేయడంలో జాప్యం చేస్తున్నారని చెప్పారు.

గ్రామాల్లో వీబీకేలు మహిళా సంఘాల మహిళలకే కాకుండా పారిశుధ్యం, హరితహారం, కుటుంబ సర్వే అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారని తెలిపారు. అలాంటి వారిని పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. సమావేశలో సిగ యాదమ్మ, మల్లేష్, విజయలక్ష్మి, సుజాత, సంధ్య, ఇందిర, పెంటయ్య, సుందరయ్యలు పాల్గొన్నారు.

22
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS