సీఎం సహాయనిధి చెక్కు అందజేత


Wed,January 11, 2017 02:08 AM

నాగారం : మండల పరిధిలోని పసునూరు గ్రామ ఆవాసం లకా్ష్మపురానికి చెందిన పి.ఉపేందర్‌కు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన 29,500 రూపాయల చెక్కును ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ తిరుమలగిరిలో బాధితుడికి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు గుడిపాటి సైదులు, దుగ్యాల రవీందర్‌రావు, తాటికొండ సీతయ్య, పొదిల రమేష్, జాని, సోమయ్య, సుధాకర్ పాల్గొన్నారు.

తుంగతుర్తి : ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ చేతులమీదుగా మంగళవారం మండల కేంద్రానికి చెందిన దారం అంజయ్యకు 16వేల రూపాయల సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న వనరుల ను సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గుడిపాటి సైదులు, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు దుగ్యాల రవీందర్‌రావు, ఎం.డీ.జాని, పూసపల్లి శ్రీనివాస్, తాటికొండ సీతయ్య, వెంకన్న, సోమయ్య, రమేష్, జాని, టీఆర్‌ఎస్వీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS