విద్యావలంటీర్ల వేతనాలు విడుదల చేయాలి


Wed,January 11, 2017 02:07 AM

నూతనకల్ : 8నెలలుగా ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న విద్యావలంటీర్లకు వేతనాలు విడుదల చేయాలని విద్యావలంటీర్ల సంఘం మండల నాయకుడు శనగల శ్రీనివాస్ కోరారు. మంగళవారం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ తమను నియమించిన నాటి నుంచి నేటి వరకు ఒక నెల వేతనం కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. పండుగ ముందు అయి నా తమ వేతనాలు మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో విద్యావలంటీర్లు మాతంగి వెంకన్న, మురళీకృష్ణ, దేవేంద్ర, లింగన్న, అవిలయ్య పాల్గొన్నారు.

మద్దిరాల : మద్దిరాల మండల పరిధిలోని వివిధ గ్రామా ల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్లకు ఐదు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారని విద్యా వలంటీర్ల సంఘం మండల అధ్యక్షుడు సిలువేరు శంకర్‌గౌడ్ అన్నారు. మండ ల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ జిల్లా, మండల విద్యాశాఖ అధికారులను అడిగితే సెప్టెంబర్ వరకు వేతనాలు విడుదలైనట్లు చెబుతున్నా అ కౌంట్లలో వేతనాలు పడలేదన్నారు. అలాగే వేతనాలు 8వేల నుంచి 15వేలకు పెంచాలన్నారు. సమావేశంలో వెంకన్న, మధుకర్, మహేష్, వెంకటేశ్వర్లు, శ్రీను పాల్గొన్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS