రెండో రోజూ కొనసాగిన జాతీయ జూడో పోటీలు


Tue,January 10, 2017 02:18 AM

శివాజీనగర్ : పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో 62వ జాతీయ స్థాయి జూడో క్రీడాపోటీలు నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రెండోరోజూ క్రీడాపోటీలను డీఈఓ వై.చంద్రమోహన్ క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు. పోటీల్లో 25రాష్ట్రాల నుంచి 320మంది బాల, బాలికలు పాల్గొంటున్నారని, వారికి వసతి, బస సౌకర్యాలు ఏర్పాటు చేశామని టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుంభం నర్సిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి జి. పుల్లయ్య, జూడో రెఫరీ సంతోష్‌కుమార్, సైక్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మార్త యాదగిరిరెడ్డి, ఆనంద్, శంభులింగం,రాజశేఖర్‌రెడ్డి, పీఆర్వో శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

అండర్-14 బాలుర విభాగంలో విజేతలు...


25 కిలోల లోపు...
తేజాపాండే(మహారాష్ట్ర)-గోల్డ్‌మెడల్, ప్రియాన్షు(పంజాబ్)-సిల్వర్‌మెడల్, అష్రాఫ్‌ఖాన్(ఢిల్లీ)- మొదటి బ్రౌంజ్, ధర్మామర్బాత్(రాజస్థాన్)-రెండో బ్రాంజ్
30 కిలోల లోపు...
విక్రమ్‌జీత్‌సింగ్(పంజాబ్)-గోల్డ్ మెడల్, సందీప్‌రాథోడ్(చత్తీస్‌ఘడ్)- సిల్వర్‌మెడల్, వినీత్(విద్యాభారతి)-మొదటి బ్రాంజ్, కిరణ్‌కశ్యప్ (హర్యానా)-రెండో బ్రాంజ్
35 కిలోల లోపు...
జతీన్(ఢిల్లీ)-గోల్డ్ మెడల్, నితిన్‌కుమార్(ఉత్తరప్రదేశ్)-సిల్వర్‌మెడల్, మంజుల్‌రోహిత్(గుజరాత్)- మొదటి బ్రాంజ్, చిరంగ్‌శర్మ(పంజాబ్)-రెండో బ్రౌంజ్ గెలుపొందారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS