ఉత్సాహాంగా అండర్-14 జాతీయ ఫెన్సింగ్ క్రీడలు


Tue,January 10, 2017 02:18 AM


శివాజీనగర్ : క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు క్రీడల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో జిల్లాకు పేరు, ప్రఖ్యాతలు తేవాలని ఎస్‌జీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కుంభం రాంరెడ్డి అన్నారు. సోమవారం ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకొని అభినందనలు తెలిపారు. పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో 62వ జాతీయ స్థాయి ఫెన్సింగ్ క్రీడలు అండర్-14 బాల, బాలికలు నల్లగొండ జిల్లా కేంద్రంలోని జూలకంటి ఇంద్రారెడ్డి ఫంక్షన్ హాల్‌లో మూడోరోజూ కొనసాగాయి. దేశవ్యాప్తంగా 13రాష్ర్టాల నుంచి 273మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నట్లు డీఈఓ వై.చంద్రమోహన్, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి జూలూరు పుల్లయ్య తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ కోచ్‌లు తుకారామ్, భవానీప్రసాద్, ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు కె.నర్సిరెడ్డి, ఆనంద్, మట్టయ్య, రవి, శంభులింగం, నాగారాజు, విమల తదితరులు పాల్గొన్నారు.

విజేతలు వీరే....
సాబ్రీ బాలుర వ్యక్తిగత విభాగంలో...
ప్రథమ తెలంగాణ(గోల్డ్‌మెడల్), ద్వితీయ జమ్ముకశ్మీర్(సిల్వర్), తృతీయ పంజాబ్, ఢిల్లీ (బ్రాంజ్) విజయం సాధించారు.
ఫాయిల్ బాలికల విభాగంలో...
ప్రథమ చండీగర్ (గోల్డ్‌మెడల్), ద్వితీయ మహారాష్ట్ర (సిల్వర్), తృతీయ హర్యానా, ఆంధ్రప్రదేశ్(బ్రాంజ్)సాధించారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS