కొనసాగినజాగృతి క్రికెట్ పోటీలు


Tue,January 10, 2017 02:17 AM

భానుపురి : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎస్వీ కళాశాలలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు రెండో రోజూ కొనసాగాయి. సోమవారం జరిగిన పోటీల్లో సూర్యాపేటకు చెందిన జైభీమ్, మిర్యాలగూడ యూత్ జాగృతి జట్లు తలపడ్డాయి. జాగృతి యూత్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 45పరుగుల తేడాతో జైభీమ్ జట్టును ఓడించింది. అనంతరం యాదాద్రి, కోదాడకు చెందిన టీసీఎస్ జట్లు తలపడగా యాదాద్రి జట్టు టీసీఎస్‌పై 39పరుగుల తేడాతో విజయం సాధించింది. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి యూత్ రాష్ట్ర కో కన్వీనర్ గుండెబోయిన చందుయాదవ్, ప్రకాష్, ప్రవీణ్, శంకర్, శ్రీకాంత్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS