రైతుల సంక్షేమానికి సీఎం నిరంతరం కృషి


Tue,January 10, 2017 02:16 AM


తిరుమలగిరి, నమస్తేతెలంగాణ : రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నాడని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పా టు చేసిన కందుల కొనుగోలు కేంద్రా న్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని మార్కెట్‌లలో ఎఫ్‌సీఐ, సీసీఐ, హకా, ఐకేపీ కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర కల్పించిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కల్పించని విధంగా కందులకు క్వింటాకు రూ. 5,050 గిట్టుబా టు ధర కల్పించిందన్నారు. గత సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు.

కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పాశం విజయయాదవరెడ్డి, బీఎంఓ నవీ న్‌రెడ్డి, ఎంపీపీ దావుల మనీషా వీరప్రసాద్, జడ్పీటీసీ పూలమ్మ, పీఏసీఎస్ చైర్మన్‌లు అశోక్‌రెడ్డి, రజాక్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ఉప్పలయ్య, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శోభన్‌బాబు, పాశం యాదవరెడ్డి, న ర్సింహరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మూల అశోక్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, రఘునందన్‌రెడ్డి, భాస్కర్, లింగన్న తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS