మరుగుదొడ్ల ఆవశ్యకతపై ఇంటింటి ప్రచారం

Tue,January 10, 2017 02:15 AM

పెన్‌పహాడ్ : ప్రతి ఇంటికి విధిగా మరుగుదొడ్డి నిర్మించుకోవాలని మండల పరిధిలోని మహ్మదాపురం సర్పంచ్ సముద్రాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మరుగుదొడ్డి ఆవశ్యకత..పరిశుభ్రత..పారిశుధ్యంపై అవగహన కల్పించారు. ప్రతి ఒక్కరు త్వరితగతిన మరుగుదొడ్డి నిర్మించుకున్నట్లయితే ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తున్నట్లు ఈఅవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లేని పక్షంలో లబ్ధ్దిదారుల జాబితా నుంచి తొలగించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీఓ శైలజ, వార్డు సభ్యులు, కార్యదర్శి తదితరులు ఉన్నారు.

16
Tags

More News

మరిన్ని వార్తలు...