గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం డైరీ ఆవిష్కరణ

Tue,January 10, 2017 02:15 AM

బొడ్రాయిబజార్ : సూర్యాపేట జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం డైరీని డీఈఓ వెంకటనర్సమ్మ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భ ంగా ఆమె మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు కష్టపడి పని చేసి జిల్లాను రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల్లో మొదటిస్థానంలో నిలుపాలన్నారు. కార్యక్రమంలో ఏడీ గజిమొద్దీన్, సంఘం జిల్లా అద్యక్షుడు పులిచింతల జనార్దన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెనుకొండ శ్రీనివాస్,కోశాధికారి జెల్లా ప్రసాద్, ఉపాధ్యక్షుడు యర్రంశెట్టి వెంకటేశ్వర్లు, అసోసియేట్ అధ్యక్షుడు చలసాని సత్యనారాయణ, సూర్యాపేట డివిజన్ అధ్యక్షుడు గట్ల సోమ య్య, ప్రధాన కార్యదర్శి దామెర శ్రీనివాస్, సభ్యులు ఎల్లారెడ్డి, గ్లోరి, సలీమ్, షరీఫ్, గోపయ్య, లక్‌పతి తదితరులు పాల్గొన్నారు.

21
Tags

More News

మరిన్ని వార్తలు...