ఆంగ్ల మాధ్యమం ఎస్జీటీల నియామకం షురూ


Mon,November 11, 2019 11:34 PM

-ఈ నెల 13న సర్టిఫికెట్ల పరిశీలన
-14న నియామక ఉత్తర్వులు
-15న విధుల్లో చేరిక
సంగారెడ్డి చౌరస్తా: ఉమ్మడి మెదక్ జిల్లా ఉపాద్యాయ నియామక ప్రక్రియలో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఆంగ్ల మాధ్యమానికి సంబంధించిన నియామకం ప్రారంభమైనదని జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మీ తెలిపారు. సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు చైర్మన్‌గా కమిటీ ఏర్పాట చేసినట్టు వెల్లడించారు. అయితే ఎంపికైన అభ్యర్థుల వివరాలతో పాటు ఖాళీల వివరాలను సంగారెడ్డి డీఈఓ కార్యాలయం నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచామన్నారు. అదేవిధంగా www. deosangareddy.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా విద్యార్థులు ఉన్న పాఠశాలలు, ఉపాద్యాయులు లేని పాఠశాలలో నియామకం చేసేందుకు ప్రాధాన్యత కల్పించనున్నట్టు వివరించారు. ఈ మేరకు సోమవారం నియామక ప్రక్రియ షెడ్యూలును డీఈఓ విడుదల చేశారు. ఈ నెల 13న ఉదయం 10 గంటల నుంచి స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉపాద్యాయ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. 14న కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని, 15న ఉదయం నుంచే వారు ఎంపికైన పాఠశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుందని డీఈఓ స్పష్టం చేశారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...