వర్గల్ : నాచగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం సామూహిక సత్యానరాయణ వ్రతమహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం నాలుగు విడుతలుగా సత్యదేవుని వ్రతాలు జరుగుతాయని తెలిపారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ధర్మ సత్రాలలో విడిది చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే స్వామివారి ద్వార ప్రవేశ ముఖద్వారం ముందు వాహనాల రద్దీ లేకుండా ప్రత్యేక పార్కింగ్ కు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కాగా కార్తిక మాసం రెండో సోమవారం కావడంతో మండపంలో వ్రతాలు జరుపుకునేందుకు బారులు తీరారు.